మానకొండూరులో బీఎల్ఏల అవగాహన, శిక్షణ సదస్సు

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: కూన శ్రీశైలం గౌడ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూరు నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) అవగాహన మరియు శిక్షణ సదస్సు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్స్‌లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఎల్ఏ శిక్షణ కార్యక్రమ ఇన్‌చార్జ్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం...