రిమ్మ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్: ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు దేశానికి ఆదర్శప్రాయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో పర్యటించిన ఆయన, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కవిత–సోము, తొడసం సుదర్శన్–మధుబాయి, సీతాబాయి–దేవురావు కుటుంబాలకు చెందిన కొత్త ఇళ్లను మంత్రి సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబాల సొంతింటి...