విశ్వకర్మలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలి: దరువు అంజన్న

ఎమ్మెల్యే వివేకానంద హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేలాది మంది విశ్వకర్మలు నివసిస్తున్నప్పటికీ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని తెలంగాణ ప్రభుత్వ టూరిజం, సాంస్కృతిక శాఖ సలహాదారు దరువు అంజన్న అన్నారు. విశ్వకర్మలకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించి, వారి అవసరాలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. సూరారంలోని విశ్వకర్మ కాలనీలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దరువు...