ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 8:24 pm Posted by : Shiva Kumar BS

ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి: కాంగ్రెస్ నాయకత్వం

జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏల అవగాహన, శిక్షణ సదస్సుల నిర్వహణ, సంఘటన్ సృజన్ అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకత్వం సూచించింది. పార్లమెంట్ కోఆర్డినేటర్లు, శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో బూత్ స్థాయి ఏజెంట్లు, బీఎల్‌వోలతో సమన్వయం పెంచి ఓటరు జాబితాల్లోని నకిలీ ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, అధికారులతో సమర్థవంతమైన సమన్వయం కొనసాగించాలని నాయకత్వం సూచించింది.

సమావేశంలో కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏల నియామకాలు, ఎస్‌ఎస్‌ఏ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పురోగతిని ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.