ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి: కాంగ్రెస్ నాయకత్వం

జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు ఎస్‌ఐఆర్, బీఎల్‌ఏల...