పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం
తెలిపిన మండల విద్యాధికారి రవీందర్ రాజు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి మూడు పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్, పాల పంపిణీ ప్రారంభం ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి రవీందర్ రాజు తెలిపారు. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి విద్యా సంవత్సరానికి సంబంధించిన సన్నాహాలను సమీక్షించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు,...