రాజ్యాధికార సమరభేరికి ఆహ్వానం
కార్మికుల చేతులు అసెంబ్లీలో చట్టాలు చేసే స్థాయికి చేరాలి: పటేల్ వనజక్క ఆదాబ్ సైబరాబాద్, భువనగిరి : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” బహిరంగ సభకు సంబంధించి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క నేతృత్వంలోని బృందం కల్లు గీత కార్మికులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది. ఈ సందర్భంగా బాలరాజ్ గౌడ్, శివ గౌడ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సభకు హాజరుకావాలని కోరారు. అనంతరం కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి...