శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ (టీపీఎంసీ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ నివాసంలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొలన్ హన్మంత్ రెడ్డి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్రంలో ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు....