జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్
ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను కూకట్‌పల్లి ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) మరియు జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా నగరంలో నివసిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గాజులరామారం హెచ్‌ఏఎల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉంటున్నట్లు తెలిసింది. దీంతో జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం...