బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల...