ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించాలి: డాక్టర్ పి.వి.వి. ప్రసాద్ ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ్‌నగర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.వి.వి. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేసిన రక్తదాతలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం డాక్టర్...