విద్యార్థినుల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమం
ఆదాబ్ సైబరాబాద్, విశాఖపట్నం: విద్యార్థినుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు విశాఖ నగర పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నివారణ అంశాలపై పాఠశాల విద్యార్థినులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ డౌన్‌లోడ్ విధానం, దాని ఉపయోగాలు, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పోలీసులు వివరించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, ఫోటో మార్ఫింగ్ ద్వారా...