18న ‘ఛలో హైదరాబాద్’

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం గన్‌పార్క్‌ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహణకు పిలుపు ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 18న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు, పత్రికల నిర్వాహకులు, కేబుల్ టీవీ ప్రతినిధులు...