కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు.. ఉదయ్ కృష్ణారెడ్డి విజయగాథ

అవమానాన్ని అవకాశంగా మార్చుకుని సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించిన యువ అధికారి ప్రకాశం జిల్లా: పేదరికం, తల్లిదండ్రుల కోల్పోవడం, జీవిత పోరాటాలు, ఉద్యోగంలో ఎదురైన అవమానాలు... ఇవన్నీ ఒక యువకుడి జీవితాన్ని వెనక్కి నెట్టాల్సిన పరిస్థితులు. కానీ ఆ కష్టాలనే మెట్లుగా మార్చుకుని కానిస్టేబుల్ స్థాయి నుంచి భారతీయ పోలీసు సేవ (ఐపీఎస్) అధికారి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. నాలుగున్నరేళ్ల వయసులో తల్లిని,...