హైదరాబాద్‌లో వర్షపు నీటి సంరక్షణకు “జల సంచయ్” కార్యక్రమం
భూగర్భ జలాల పరిరక్షణ, వరదల నివారణే లక్ష్యం ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్-మల్కాజిగిరి: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నిర్మాణాలు, తగ్గిపోతున్న భూగర్భ జలాల నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్) అత్యంత అవసరంగా మారింది. నగరంలోని అధిక భాగం గట్టి గ్రానైట్ భూభాగం కావడంతో వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకకపోవడం, మరోవైపు కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లోకి చేరి వరదలకు కారణమవుతోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పర్వతిని ఆంజనేయ వర్మ ఆధ్వర్యంలో...