ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:07 pm Posted by : Shiva Kumar BS

కైలాశేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

  • ప్రత్యేక పూజలు.. దేవాలయ ప్రాంగణంలో మొక్క నాటిన ఎమ్మెల్యే

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ మాదేవపురం కైలాష్ హిల్స్‌లో ఉన్న శ్రీ కైలాశేశ్వర స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు సందేశ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు యాదయ్య, దేవాలయ చైర్మన్ వెంకటేశ్వర రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు భాస్కరమూర్తి, వసంత్ బాబు, ప్యాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, మూసాఖాన్, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, తారా సింగ్, మసూద్, చిన్న చౌదరి, రాములు గౌడ్, దూలప్ప, నవీన్ దండుగుల, ప్రసాద్, శ్రవణ్, గౌస్, జునైద్, సయ్యద్ రంజాన్, భాస్కర్ ముదిరాజ్, రవికిరణ్ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.