కైలాశేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ప్రత్యేక పూజలు.. దేవాలయ ప్రాంగణంలో మొక్క నాటిన ఎమ్మెల్యే ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ మాదేవపురం కైలాష్ హిల్స్‌లో ఉన్న శ్రీ కైలాశేశ్వర స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన...