జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : ఈ నెల 20న నిర్వహించనున్న రెండో జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్మన్ ఎం. నాగరాజు కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను అధిక సంఖ్యలో జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేయాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు తక్కువ ఖర్చుతో,...