పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలి: ఏఐటీయూసీ

ఆదాబ్ సైబరాబాద్, నిజాంపేట్ : నిజాంపేట్ సర్కిల్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలను వెంటనే జమ చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఏసు రత్నం డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కార్మికులకు అందించే వర్షాకాల కిట్‌ను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. ఈ మేరకు ఏఐటీయూసీ ప్రతినిధులు నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ షబీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాలభిందెల...