పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా
ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పోలీసు అధికారులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో వివిధ విభాగాలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను ఎస్పీ సమీక్షించారు. దర్యాప్తులో జరుగుతున్న జాప్యాలపై అధికారులను ప్రశ్నిస్తూ, బాధితులకు సకాలంలో న్యాయం అందించడం పోలీసు వ్యవస్థ...