ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:19 pm Posted by : Shiva Kumar BS

వినియోగదారుల మనసులు గెలుచుకుంటేనే వ్యాపారంలో విజయం సాధ్యం: బండి రమేష్

ఆదాబ్ సైబరాబాద్, కూకట్పల్లి : వినియోగదారులకు నచ్చేలా, మెచ్చేలా నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారం నిర్వహిస్తే వారి మనసులను గెలుచుకోవచ్చని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు.

గాజులరామారంలో బాబు, మహేష్, నరేష్, అభినయ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ది బేక్ హౌస్” స్వీట్ షాప్‌ను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణాన్ని పరిశీలించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ, వ్యాపార రంగంలో విజయానికి వినియోగదారుల విశ్వాసమే ప్రధాన మూలధనమని పేర్కొన్నారు. నాణ్యత, పరిశుభ్రత, స్నేహపూర్వక సేవలతో వినియోగదారుల ఆదరణను పొందాలని సూచించారు. స్థానిక యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి దినేష్ కుమార్, యాక నారాయణ, వినోద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.