ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ఆమె ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా...