ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 10:02 pm Posted by : Shiva Kumar BS

ప్రగతి నగర్‌లో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం: కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్-276లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రగతి నగర్ ప్రాంత ప్రజలు నిత్యం తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతూ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకు తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రగతి నగర్ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, సమస్యపై సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారం సాధించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు, మురళీకృష్ణ, నారాయణ రెడ్డి, సురేంద్ర కుమార్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఆది రెడ్డి, మహేష్, మధుసూదన్ రెడ్డి, రఫత్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.