ప్రగతి నగర్‌లో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం: కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్-276లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రగతి నగర్ ప్రాంత ప్రజలు నిత్యం తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతూ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకు తగిన...