తెలంగాణలో మరో భారీ అవినీతి కేసు బహిర్గతం
డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తులపై ఏసీబీ దాడులు.. రూ.13 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణలో మరో భారీ అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. అవినీతి ద్వారా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు నివాసాలు, కార్యాలయాలతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.13 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల సందర్భంగా నరహరి...