సురక్షిత వికారాబాద్ కోసం యువతతో డీఎస్పీ అంజయ్య సమావేశం
నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వ్యాఖ్య ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్, జూన్ 18: నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అత్యంత అవసరమని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని యువ నాయకులు, వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా కార్యకర్తలతో తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ అంజయ్య మాట్లాడుతూ ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేరాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణ చర్యలు...