జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ భద్రతా ఏర్పాట్లు

సీఎస్‌ఆర్ సహకారంతో సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పాఠశాల ఆస్తులను పరిరక్షించేందుకు జీడిమెట్ల ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్రిజ్లోనా కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా ఐదు ప్రభుత్వ పాఠశాలలకు భద్రతా సౌకర్యాలను అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున మొత్తం 10 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను...