తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్‌కు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానం

ఆదాబ్ సైబరాబాద్, భువనగిరి, జూన్ 18: జులై 5న భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్విరాజ్‌ను పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క నేతృత్వంలోని బృందం కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో సామాజిక న్యాయం, బహుజన వర్గాల రాజకీయ సాధికారత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఉద్యమాల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే...