ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం ముఠాకు సహకరించిన ఏడుగురు అరెస్ట్
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి సంపాదించిన డబ్బును అక్రమంగా తరలిస్తున్న నెట్‌వర్క్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. డీసీపీ సైబర్ క్రైమ్స్ టి. సాయి మనోహర్ పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ వ్యవహారానికి సంబంధించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, సైబర్ నేర ముఠాలు మోసాల ద్వారా సేకరించిన నగదును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడం, ఖాతాదారులను సమకూర్చడం, మోసపూరిత లావాదేవీల ద్వారా...