రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని రక్షించిన రెవెన్యూ అధికారులు అభినందనలు తెలియజేసిన నల్ల జయశంకర్ గౌడ్ ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : పెదబషీర్‌బాద్ గ్రామం సర్వే నెం.23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయడంపై సామాజిక కార్యకర్త నల్ల జయశంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు....