వీసా పొడిగింపు పేరుతో రూ.9.60 లక్షల మోసం.. ఇద్దరు అరెస్ట్

సైబరాబాద్ : వీసా ఎక్స్‌టెన్షన్ చేస్తామని నమ్మబలికి ఓ మహిళ నుంచి రూ.9.60 లక్షలు మోసం చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మోసపూరితంగా వసూలు చేసిన మొత్తం రూ.9,60,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన అర్జున్ రెడ్డి (38) ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తూ బాధితురాలి కుమార్తెకు దీర్ఘకాలిక వీసా పొడిగింపు ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో విడతల వారీగా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు....