ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 10:08 pm Posted by : Shiva Kumar BS

ఘనంగా కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుక

నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షల వెల్లువ

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : సూరారం డివిజన్ విశ్వకర్మ కాలనీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సూరారం గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం యాదవ్, ఎరుకల రాజు, జిమ్ వేణు, గజానంద్, పృథ్వి, బబన్, విక్కీ రెడ్డి, జోషఫ్, కిరణ్, అనుదీప్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని ప్రశంసించారు.

ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులతో కలిసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.