ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనం
మహిళల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం : బండి రమేష్ ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి కానుక – ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం కేపీహెచ్‌బీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్...