అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం

జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ “క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు” అనే సందేశంతో యువతకు అవగాహన ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 42 జట్లు పాల్గొన్నాయి. వీటిలో 10 బాలికల జట్లు,...