ప్రగతి నగర్ కూరగాయల మార్కెట్ కొనసాగింపుపై కొలన్ హన్మంత్ రెడ్డికి వినతి

ప్రజల భద్రత, వ్యాపారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే మార్కెట్ కొనసాగించాలని విజ్ఞప్తి ఆదాబ్ సైబరాబాద్, బాచుపల్లి : ప్రగతి నగర్ కూరగాయల మార్కెట్ నిర్వహణకు సంబంధించి మార్కెట్ యాజమాన్యం, స్థానికులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పెద్దగా లేవని తెలిపారు. అయితే మార్కెట్‌ను ప్రగతి స్కూల్ మెయిన్ రోడ్ వద్ద...