రూ.107 కోట్లతో నాలుగు చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం
పూజలు చేసి పనులు ప్రారంభించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : నగరంలో వరదల నియంత్రణతో పాటు భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులకు హైడ్రా గురువారం శ్రీకారం చుట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్‌లోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువు,...