డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా

తాండూర్ రూరల్ సర్కిల్ రికార్డ్ పరిశుభ్రత పై అరా ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం తాండూర్ రూరల్ సర్కిల్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యాలయాల పరిశుభ్రత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, అనంతరం వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో...