తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి – జూలై 2న భూ పోరాటం

ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న నరేష్ ప్రజాపతి ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ జీహెచ్‌ఎంసీ ఉద్యమకారుల ఇన్‌చార్జ్ నరేష్ ప్రజాపతి హెచ్చరించారు. జూలై 2న ఉప్పల్ బాగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన...