మాదకద్రవ్యాల నిర్మూలనపై ‘కాఫీ విత్ ఎ కాప్’ అవగాహన కార్యక్రమం

ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్, మైండ్‌స్పేస్లో “కాఫీ విత్ ఎ కాప్” నాలుగో ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం, సమాజంలో సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ...