పోలీసులకు ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన సదస్సు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక అవగాహన నిపుణుడు కౌశిక్ మారిడి ముఖ్య వక్తగా హాజరై పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ డివిజన్ సహాయ పోలీసు కమిషనర్ (ఏసీపీ) ఎ.సి. బాల గంగిరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌశిక్ మారిడి మాట్లాడుతూ, దేశంలో సాధారణ అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ ఆర్థిక అక్షరాస్యత విషయంలో ఇంకా ప్రజల్లో...