అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠా అరెస్ట్..

అక్రమ తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : నగరంలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు, మెయిలార్దేవ్‌పల్లి పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెహఫిల్ హోటల్ సమీపంలో టీఎస్23ఎఫ్1701 నంబర్ గల బలెనో కారును తనిఖీ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు దేశీయ తయారీ తుపాకులు (కంట్రీ మేడ్ పిస్టల్స్), ఏడు లైవ్ బుల్లెట్లు, మూడు మొబైల్ ఫోన్లు,...