మ్యాట్రిమోనీ పేరుతో రూ.1.46 కోట్ల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : రూ.1.46 కోట్ల మ్యాట్రిమోనీ-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ మోసం కేసును ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితుల నుంచి మోసపూరితంగా వసూలు చేసిన నగదును మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా తరలించి, హవాలా మార్గంలో సింగపూర్‌కు చెందిన సైబర్ మోసగాళ్లకు చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అరెస్టు చేసిన నిందితులు సిద్ధిపేటకు చెందిన చొక్కాల సంపత్, సికింద్రాబాద్‌కు చెందిన హెచ్చు నరేష్, ఎండ్ల సురేష్, వడ్కల మహేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి ఒక మొబైల్...