బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 48వ ఉచిత వైద్య శిబిరం
కుత్బుల్లాపూర్ : చింతల్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో బీకేఆర్ (బొంగుణూరి కిషోర్ రెడ్డి) ఫౌండేషన్ ఆధ్వర్యంలో 48వ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ కమిటీ వైస్ చైర్మన్ బొంగుణూరి కిషోర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండీ ఫలాహ్ ఉర్ రహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ఫలాహ్ ఉర్ రహమాన్ మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమైన కార్యక్రమమని...