ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 10:26 pm Posted by : Shiva Kumar BS

ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ప్రారంభించిన కొలన్

  • నందానగర్ పోలియో కేంద్రం సందర్శచి
  • ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ రెడ్డి

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదివారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. అనంతరం నందానగర్‌లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్న తీరును పరిశీలించారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొని ఓటరు నమోదు, వివరాల సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, బూత్ లెవల్ అధికారులు అందించే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని కోరారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జలీల్ ఖాన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి, మహమ్మద్ పాషా, ఎల్లేష్, కాక, నీలా గుప్తా, రాజు, మహమ్మద్ గౌస్, మహమ్మద్ మఖసూద్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.