జీడిమెట్లలో జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభం
కుత్బుల్లాపూర్: సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉండి, సంఘ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పిలుపునిచ్చారు.ఆదివారం 132వ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, చింతల్–కుత్బుల్లాపూర్ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెంట్రింగ్ కార్మికులు సంఘటితంగా ఉంటేనే వారి సమస్యల పరిష్కారం...