పోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియోను నిర్మూలిద్దాం!
జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల 132వ డివిజన్, కుత్బుల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది సేవలను అభినందిస్తూ, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, "పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ఐదేళ్ల...