రోడ్డుపై ఆక్రమణల తొలగింపు
కుత్బుల్లాపూర్ : సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అలాగే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ రోడ్డుపై ఉన్న రహదారి ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ను సాఫీగా నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలు, ఇతర అడ్డంకులను అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్...