ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-పరిశీలించిన కూకట్‌పల్లి ఈఆర్‌ఓ
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం-46 ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ, కూకట్‌పల్లి జోన్ జోనల్ కమిషనర్ బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, మోతీనగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓస్) కూడా పాల్గొన్నారు. పరిశీలన సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని ఈఆర్‌ఓ సమీక్షించారు. అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం, అనర్హుల...