ఏసీబీ వలలో డీఎస్పీ..ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. విధుల్లో ఉన్న సమయంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు...