ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:25 pm Posted by : Shiva Kumar BS

వంగవీటి రంగా ఆశయాలు చిరస్మరణీయం

  • ఘనంగా వంగవీటి మోహనరంగ జయంతి
  • ఆల్విన్ డివిజన్‌లో నివాళులు
  • జిల్లా గణేష్ నేత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆల్విన్ డివిజన్ ఎల్లమ్మబండలో వంగవీటి మోహనరంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ నేత, పార్టీ కార్యకర్తలు కలిసి వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు, స్థానికులకు ఆహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. పేదల సంక్షేమం, భూమి పట్టాల పంపిణీ, ప్రజా సమస్యలపై నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.

ప్రతి సంవత్సరం వంగవీటి మోహనరంగ జయంతి, వర్ధంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున నివాళులర్పించడం ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాస్కర్, సత్యనారాయణ, రూబెన్, రెహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళలు, కాలనీవాసులు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.